
హీరోయిన్లు ఎప్పుడు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. కొందరు ఏళ్లకు ఏళ్లు కష్టపడినా గుర్తింపు రాదు. మరికొందరు ఒక్క మూవీకే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. 'ప్రేమలు' బ్యూటీ మమిత ఈ కోవలోకే వస్తుంది. తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తున్న ఈమె ఇప్పుడు రెమ్యునరేషన్ గట్టిగానే పెంచేసినట్లు తెలుస్తోంది.
మలయాళంలో తొలుత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసిన మమితకు 'ప్రేమలు' మూవీతో హీరోయిన్ గా బ్రేక్ దొరికింది. అటు సొంత భాషతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న 'డ్యూడ్', దళపతి విజయ్ లేటెస్ట్ చిత్రాల్లో నటిస్తోంది.
(ఇదీ చదవండి: మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్)
ఇదివరకు హీరోయిన్ గా ఒక్కో సినిమాకు రూ.50 లక్షల్లోపే రెమ్యునరేషన్ అందుకున్న మమిత.. ఇప్పుడు 'డ్యూడ్' కోసం రూ.70 లక్షలకు పైనే అందుకుంటోందట. దళపతి విజయ్ తో చేస్తున్న జన నాయగణ్ కోసమైతే ఏకంగా రూ.కోటి పారితోషికం అందుకుందట.
ఒకవేళ ఈ రెండు సినిమాలు గనక హిట్ అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ క్రేజ్ రావడం గ్యారంటీ. అప్పుడు ఇంకాస్త రెమ్యునరేషన్ పెంచినా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ రెండు కాకుండా మరో తమిళ మూవీ కూడా మమిత చేతిలో ఉంది.
(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)