
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు, యంగ్ హీరోల నటించిన చిత్రాలు వీలైనంత త్వరగా వచ్చేస్తాయి. కానీ కొన్ని చిన్న మూవీస్ కి మాత్రం చాన్నాళ్లకు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా ఓ తెలుగు సినిమా దాదాపు ఆరు నెలల తర్వాత సడన్ గా వచ్చేసింది.
గతేడాది నవంబర్ లో రిలీజైన తెలుగు మూవీ 'సినిమా పిచ్చోడు'. కుమారస్వామి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. పెద్దగా ఆకట్టుకోని స్టోరీ, తక్కువ బడ్జెట్ తో తీసిన చిత్రం కావడంతో థియేటర్లలోకి వచ్చి వెళ్లిన సంగతి కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.
(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో)
సినిమా పిచ్చోడు విషయానికొస్తే.. జోష్ అలియాస్ కుమారస్వామి గ్రామంలో పాలు అమ్ముతుంటాడు. కానీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఊరిలో వాళ్లని పేరుతో కాకుండా సినిమా పేర్లతో పిలుస్తుంటాడు. ఓసారి భాను.. డెమో ఫిల్మ్ తీసేందుకు జోష్ ఉంటున్న ఊరికి వస్తుంది. ఈ క్రమంలో అనుకోకుండానే జోష్ కి నటించే అవకాశమొస్తుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే.. మరణమాస్, భోల్ చుక్ మాఫ్, నెసిప్పయ అనే సినిమాలు రాబోతున్నాయి. గత వీకెండ్ లో రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ, జాక్, ఓదెల 2, కాలమే కరిగింది తదితర తెలుగు చిత్రాలు వచ్చాయి. ఈ వీకెండ్ మరి ఏమేం తెలుగు మూవీస్ ఓటీటీలోకి వస్తాయో చూడాలి?
(ఇదీ చదవండి: గుడ్ న్యూస్.. సుడిగాలి సుధీర్ ఇంట్లో సంబరాలు)