మోనాలిసాకు మరో ఛాన్స్.. ఈసారి స్పెషల్ సాంగ్ | Monalisa Dancing Private Song With Actor Utkarsh Singh, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Monalisa: 'కుంభమేళా' మోనాలిసాకి ఇంత క్రేజా.. మరో ఆఫర్

May 14 2025 12:32 PM | Updated on May 14 2025 1:18 PM

Monalisa Dancing Private Song With Actor Utkarsh Singh

ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. ఎవరు ఎందుకు ఎప్పుడు ఫేమస్ అవుతారో అస్సలు చెప్పలేం. ఊరగాయలు అమ్మినా ఫేమస్ అవ్వొచ్చు. పూసలు అమ్మినా సరే ఫేమస్ అయిపోవచ్చు. అలానే కొన్నాళ్లక్రితం జరిగిన కుంభమేళాలో పూసలమ్ముతూ వైరల్ అయిపోయిన మోనాలిసా ఇప్పుడు మరో అవకాశం అందుకుంది.

(ఇదీ చదవండి: 'పెద్ది'... ఈసారి రాసి పెట్టుకోండి: రామ్ చరణ్  

మోనాలిసాకు ఇదివరకే ఓ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చిందో తెలీదు గానీ ఇప్పుడు మరో ఛాన్స్ పట్టేసింది. ఉత్కర్ష్ సింగ్ అనే నటుడు తీసిన ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాలిసాని తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. త్వరలోనే ఈ పాటని యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు.

సినిమా ఛాన్సుల మాటేమో గానీ కుంభమేళాలో పూసలమ్మే టైంకి.. ఇప్పటికీ చాలా మారిపోయింది. మోనాలిసా ఎప్పుడు కనిపించినా మేకప్ తోనే కనిపిస్తోంది. త్వరలో ఈమె నటించిన సాంగ్ రిలీజ్ అవుతుంది. అ‍ప్పుడు ఈమె సంగతేంటో జనాలకు ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

 (ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా 

Advertisement
 
Advertisement
Advertisement