
రామ్ చరణ్ మైనపు విగ్రహం.. రీసెంట్ గా లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కోసం కుటుంబంతో కలిసి చరణ్ అక్కడికి వెళ్లాడు. విగ్రహావిష్కరణ పూర్తి కాగానే యూకేలోని తన అభిమానులని కలిసి ముచ్చటించాడు. 'పెద్ది' విశేషాలు చెప్పి హైప్ పెంచేశాడు.
(ఇదీ చదవండి: 6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

అభిమానులతో మాట్లాడిన చరణ్.. 'పెద్ది' సినిమా రంగస్థలం కంటే గొప్పగా ఉండబోతుంది. మామూలుగా అన్ని సినిమాలకు ఇలా చెప్పను. కానీ ఈసారి రాసిపెట్టుకోండి' అని చెప్పాడు. దీంతో అక్కడున్న ఫ్యాన్స్ అరిచి గోలగోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇదివరకే రిలీజ్ చేసిన 'పెద్ది' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా చివరలో వచ్చే క్రికెట్ షాట్ అందరికీ తెగ నచ్చేసింది. ఈ సందర్భంగా లండన్ లో ఫ్యాన్స్.. ఓ బ్యాట్ ని రామ్ చరణ్ కి బహుకరించారు. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లలోకి రానుంది. బుచ్చిబాబు దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
(ఇదీ చదవండి: రోజుకు రూ.20 జీతానికి పనిచేశా.. హీరో ఎమోషనల్ వీడియో)
Idhi nenu mamuluga anni cinemalaki cheppanu... Ee Cinema matram raasi pettukondi 💥💥💥@AlwaysRamCharan about #PEDDI ! pic.twitter.com/CPOKMjOwcl
— Trends RamCharan ™ (@TweetRamCharan) May 13, 2025