సినిమా లీక్‌పై జన నాయగన్‌ హీరోయిన్ల కామెంట్స్‌ | Pooja Hegde And Mamitha Baiju Comment On Jana Nayagan Issue | Sakshi
Sakshi News home page

సినిమా లీక్‌పై జన నాయగన్‌ హీరోయిన్ల కామెంట్స్‌

Apr 13 2026 7:00 AM | Updated on Apr 13 2026 8:38 AM

Pooja Hegde And Mamitha Baiju Comment On Jana Nayagan Issue

నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా, చివరి చిత్రం జన నాయకన్‌. పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమిత బైజు, ప్రియమణి తదితరులు నటించారు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కెవిఎన్‌ పిక్చర్స్‌ సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం  జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సి ఉంది. అయితే, సెన్సార్‌ సమస్యల కారణంగా విడుదల ఆగిపోయిన ఈ చిత్రం ఇటీవల ఇంటర్నెట్‌లో లీక్‌ కావడం యావత్‌ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. భాషా భేదం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్‌ సినీ ప్రముఖులు ఈ సంఘటనను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర కథానాయకుడు విజయ్‌ మాత్రం ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నారు. అయితే చిత్ర కథానాయకి పూజహెగ్డే, మమిత బైజు జననాయకన్‌ చిత్రం ఇంటర్నెట్‌ లో లీక్‌ అయిన ఘటన గురించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పూజా హెగ్డే సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ “ ప్రియమైన అభిమానులారా ఒక చిత్ర నిర్మాణం అనేది ఎంతోమంది ఎన్నో రోజుల శ్రమ. ధైర్యంతో కూడిన ప్రయత్నాలు, వ్యక్తిగత త్యాగాలు. అదే విధంగా మీకు మంచి అనుభవాన్ని అందించాలన్న నమ్మకంతో ప్రతిరోజూ క్రమం తప్పకుండా షూటింగ్‌లో పాల్గొనే యూనిట్‌ సభ్యుల సమష్టి ప్రయత్న ఫలితం. అలాంటి మా జననాయక్‌ చిత్రం ఇంటర్నెట్‌లో రావడం నాకు మాత్రమే కాకుండా ఈ చిత్రంలో పనిచేసిన  యూనిట్‌ సభ్యులు అందరికీ తీవ్ర మనోవేదనను కలిగించింది. ఈ చిత్రాన్ని మనందరం థియేటర్లో చూడటానికి కొంచెం వేచి చూద్దాం. జననాయకన్‌ చిత్రం కచ్చితంగా థియేటర్‌లో సరైన సమయంలో విడుదలవుతుంది. పైరసీని ఎప్పటికీ ప్రోత్సహించవద్దు ‘‘ అని పేర్కొన్నారు. 

నటి మమిత బైజు కూడా ఇలాంటి అభిప్రాయానే వ్యక్తం చేశారు. ’’ పలువురి శ్రమ, కృషితో రూపొందిన చిత్రాన్ని చట్టవిరుద్ధంగా చూడటం వేదనను కలిగిస్తోంది. కాబట్టి  జననాయకన్‌ చిత్రాన్ని అధికారిక పూర్వంగా విడుదలయ్యే వరకు వేచి చూద్దాం “ అని నటి మమిత బైజు పేర్కొన్నారు. కాగా  జననాయకన్‌ చిత్రం ఇంటర్నెట్‌లో లీక్‌ కావడానికి  సెన్సార్‌ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర సెన్సార్‌ బోర్డు స్పష్టం చేసింది. ఇకపోతే ఈ విషయం గురించి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ అధికారులు తీవ్రం విచారణను చేపట్టారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement