ప్రేమ‌లు బ్యూటీ అస‌లు పేరేంటో తెలుసా? చిన్న పొర‌పాటు.. | Do You now Mamitha Baiju Original Name? | Sakshi
Sakshi News home page

ఒక్క పొర‌పాటుతో జాత‌క‌మే మారిపోయింది! అస‌లు పేరేంటంటే?

May 6 2024 10:35 AM | Updated on May 6 2024 10:35 AM

Do You now Mamitha Baiju Original Name?

అయినా ఈ పేరు కూడా బానే ఉంద‌ని అలాగే ఉంచేశారు. మ‌మిత అంటే మ‌ల‌యాళంలో మిఠాయి అని అర్థం. ఈ విష‌యా

మ‌మితా బైజు.. ఇప్ప‌టివ‌ర‌కు 15కు పైగా సినిమాలు చేసింది. కానీ సౌత్‌లో ఒక్క‌సారిగా ట్రెండ్ అయింది మాత్రం 16వ సినిమా ప్రేమ‌లుతోనే! ఇప్ప‌టివ‌ర‌కు అన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క‌ ప్రేమ‌లు మూవీతో వ‌చ్చింది. ప్ర‌స్తుతం రెబ‌ల్ మూవీతో త‌మిళంలో ఎంట్రీ ఇవ్వ‌నుంది. 

అస‌లు పేరు అది కాదు!
తెలుగులోనూ అవ‌కాశాలు త‌లుపుత‌డుతున్నాయి. అయితే ఈమె అస‌లు పేరు మ‌మిత కాద‌ట‌.. న‌మిత‌! హాస్పిట‌ల్ సిబ్బంది బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌లో ఎన్ అనే అక్షరానికి బ‌దులుగా ఎమ్ అని రాసేశారు. దీంతో న‌మిత కాస్త మ‌మిత అయిపోయింది. పేరెంట్స్ కూడా దీన్న‌స‌లు చూసుకోనేలేదు.

ఒక్క అక్ష‌రం
బ‌డిలో చేర్పించే స‌మ‌యంలో మ‌మిత అని ప‌డింద‌ని గ‌మ‌నించారు. అయినా ఈ పేరు కూడా బానే ఉంద‌ని అలాగే ఉంచేశారు. మ‌మిత అంటే మ‌ల‌యాళంలో మిఠాయి అని అర్థం. ఈ విష‌యాన్ని ప్రేమ‌లు బ్యూటీయే స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఒక్క పొర‌పాటుతో త‌న జాత‌క‌మే మారిపోయింద‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు

చ‌ద‌వండి: ఓటీటీల్లోకి ఏకంగా 17 మూవీస్.. ఆ రెండు స్పెషల్

Advertisement
 
Advertisement
Advertisement