'ప్రేమలు' హీరోయిన్‌కి చేదు అనుభవం.. ఊపిరాడనివ్వలేదు! | Premalu Fame Mamitha Baiju Mobbed By Fans In Chennai | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: మమిత వీర ఫ్యాన్స్.. మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు!

Jun 3 2024 4:21 PM | Updated on Jun 3 2024 4:49 PM

Premalu Fame Mamitha Baiju Mobbed By Fans In Chennai

'ప్రేమలు' సినిమాతో మనకు బాగా నచ్చేసిన మలయాళ బ్యూటీ మమిత బైజు. ఈ ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అప్పటివరకు కేరళలో మాత్రం ఈమెకు ఫ్యాన్ బేస్ ఉండేది. 'ప్రేమలు' తర్వాత దక్షిణాదిలో ఈమెకు చాలామంది అభిమానులు అయిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా మమిత, చెన్నై వెళ్లగా ఈమెకు ఊపిరి ఆడనివ్వకుండా చేసి పడేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)

గత కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మమిత బైజు.. 'ప్రేమలు' మూవీతో లీడ్ యాక్టర్‌గా ఫేమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలోని ఓ జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చింది. అయితే ఊహించని విధంగా చాలామంది కుర్ర అభిమానులు అక్కడికి వచ్చేశారు. కనీసం షాప్ లోపలికి కూడా మమిత వెళ్లకుండా ఇబ్బంది పెట్టేశారు.

ఎలాగైతేనేం బౌన్సర్ల సహాయంతో షాప్ లోపలికి మమిత వెళ్లింది. కానీ ఆమె మొహంలో ఇదెక్కడి అభిమానం రా బాబు అనే భయం మాత్రం కనిపించింది! ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కొన్నాళ్ల ముందు కాజల్ అగర్వాల్‌కి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

(ఇదీ చదవండి: ప్రభాస్ ఇంటి ఫుడ్‍‌ని మర్చిపోలేకపోతున్న హీరోయిన్.. ఐదేళ్లయినా సరే)

Advertisement
 
Advertisement
Advertisement