ఎట్టకేలకు ఓటీటీలోకి 'ప్రేమలు' సినిమా | Premalu Movie Streaming Date Locked | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఓటీటీలోకి 'ప్రేమలు' సినిమా

Apr 1 2024 10:26 AM | Updated on Apr 1 2024 10:44 AM

Premalu Movie Streaming Date Locked - Sakshi

మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర‌ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్ష‌న్ మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీ విషయంలో అధికారికంగా ప్రకటన వచ్చేసింది.

ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చే విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్స్‌ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్‌ 12 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. యూత్ లవ్ స్టోరీస్ ఆధారంగా నస్లేన్‌ కె.గఫూర్‌, మాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ.డి. ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

కేవలం రూ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ త‌న స్నేహితుల‌తో క‌లిసి నిర్మించాడు. బాక్సాఫీస్‌ వద్ద ప్రస్తుతం రూ. 135 కోట్ల మార్క్‌ను చేరుకుంది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.17 కోట్లు రాబట్టింది. ఏప్రిల్‌ 12 నుంచి ఈ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement