
నాగార్జున.. రీసెంట్‌గానే 'కూలీ' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇన్నాళ్లు హీరోగా చేసిన నాగ్.. ఈ సినిమాలో విలన్‌గా కనిపించాడు. రైటింగ్ పరంగా ఈ పాత్రపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ నాగ్ లుక్స్ మాత్రం తెలుగు-తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి. తమిళ యూత్ అయితే నాగ్ హెయిర్ స్టైల్ అనుకరిస్తూ తెగ రీల్స్ చేస్తున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే నాగ్ క్రేజ్ ఇప్పటితరం హీరోయిన్లలోనూ గట్టిగానే ఉందండోయ్.
సందర్భం ఏంటో తెలీదు గానీ మలయాళ యంగ్ హీరోయిన్లు అయిన మమిత బైజు, అనస్వర రాజన్, ప్రియ వారియర్, దీప్తి సతితో నాగ్ కలిసున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గ్లామర్ విషయంలో ఈ బ్యూటీస్‌తో నాగ్ కలిసిపోయి యంగ్‌గా కనిపిస్తున్నాడని చెప్పొచ్చు. ఒకప్పటి తరం హీరోయిన్లతో చేసిన నాగ్.. 2010ల్లో అప్పటి క్రేజ్ హీరోయిన్లతోనూ సినిమాలు చేశాడు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటో చూస్తుంటే వీళ్లతోనూ మూవీస్ చేస్తాడేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: సింగర్‌తో తిరుమలకు హీరో జయం రవి)
నాగ్ జనరేషన్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తదితరుల సినిమాల్లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీపై అప్పుడప్పుడు ట్రోల్స్ లాంటివి కనిపిస్తుంటాయి కానీ నాగ్ విషయంలో మాత్రం అలాంటి కంప్లైంట్స్ పెద్దగా వినిపించవనే చెప్పొచ్చు. అదన్నమాట విషయం. త్వరలో తన 100వ సినిమా గురించి నాగ్ నుంచి ప్రకటన రావొచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. తమిళ యువ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు వచ్చే నెల 7వ తేదీ నుంచి మొదలయ్యే బిగ్‌బాస్ 9వ సీజన్ కోసం నాగార్జున సిద్ధమైపోతున్నాడు. 3వ సీజన్ నుంచి హోస్టింగ్ చేస్తున్న నాగ్.. ఈసారి కూడా హోస్ట్‌గా కొనసాగబోతున్నాడు. ప్రస్తుతం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులని ఎంపిక చేసేందుకు గేమ్ నడుస్తోంది. ఇది అయిపోయిన వెంటనే.. అసలు షో షురూ కానుంది. ఈసారి ఇమ్మాన్యుయేల్‌తో పాటు పలువురు టీవీ యాక్టర్స్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి దేవరకొండ 'కింగ్డమ్'.. అధికారిక ప్రకటన)