
కోలీవుడ్ హీరో జయం రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్ఫ్రెండ్గా భావిస్తోన్న సింగర్ కెన్నీషాతో కలిసి తిరుమలకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన భార్య ఆర్తితో విడాకుల వివాదం తర్వాత వీరిద్దరు జంటగా పలుసార్లు కనిపించారు. తాజాగా తిరుమలలో సందడి చేశారు.
జయం రవి సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వీరిద్దరు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. జయం రవి తొలి నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్‌ను చెన్నైలో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మరోవైపు జయం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గణేష్ కె బాబు దర్శకత్వం వహించిన 'కరాటే బాబు', సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' లాంటి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా తన భార్య ఆర్తితో విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచారు. వీరిద్దరు విడిపోవడానికి సింగర్ కెనీషా ప్రమేయం ఉందని వార్తలొచ్చాయి. నటుడు గణేష్ కుమార్తె వివాహంలో చేతులు పట్టుకుని కనిపించడంతో రూమర్స్ మరింత ఊహందుకున్నాయి.
ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో తమిళ హీరో జయం రవి (రవి మోహన్), సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. @iam_RaviMohan @kenishaafrancis #tirumala #tirupatiupdates #Tirupati #TTD #jayamravi #RaviMohan #KenishaaFrancis #tamilhero pic.twitter.com/k5K8tLXKLZ
— Tirupati Updates (@TirupatiUpdates) August 25, 2025