
విజయ్ దేవరకొండ గత నెలలో 'కింగ్డమ్' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పలుమార్లు వాయిదా పడిన చిత్రం.. గత నెల చివరలో థియేటర్లలోకి వచ్చింది. అయితే రిలీజైన ఒకటి రెండు రోజులు హడావుడి నడిచింది. కానీ తర్వాత నెగిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రాలేదు. దీంతో నష్టాలు మూటగట్టుకుంది. అలాంటిది ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఏ ఓటీటీలోకి రానుందంటే?
విజయ్ దేవరకొండ-భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'కింగ్డమ్' చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ నిర్మాత. జూలై 31న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇప్పడు ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లోకి రానుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)
'కింగ్డమ్' విషయానికొస్తే.. సూరి (విజయ్ దేవరకొండ) ఓ కానిస్టేబుల్. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలోనే పోలీస్ అధికారులతో సూరికి గొడవ జరుగుతుంది. అయితే ఉద్యోగం నుంచి తీసేయకుండా ఓ సీక్రెట్ మిషన్ అప్పజెబుతారు. శివ ఆచూకీ శ్రీలంక సమీపంలోని ఓ ద్వీపంలో ఉందని, గూఢచారిగా అక్కడ పనిచేయాలని చెబుతారు.
అన్న కోసం ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమైన సూరి.. శ్రీలంకలో అడుగుపెడతాడు. మరి సూరికి తన అన్న శివ దొరికాడా లేదా? అక్కడి తెగ 70ఏళ్లుగా ఎవరి రాకకోసం ఎదురు చూస్తోంది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓం రౌత్ నిర్మాతగా ఓటీటీ సినిమా.. ట్రైలర్ రిలీజ్)
Bangaram tho, raktham tho, nippu tho kattina ee Kingdom ni yelladaniki oka naayakudu osthunnadu!🤴🔥 pic.twitter.com/F7NKRYwXEg
— Netflix India South (@Netflix_INSouth) August 25, 2025