ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు | Here's The List Of 27 New Movies And Web Series Releasing In OTT On August 2025 Fourth Week | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లోకి ఏకంగా 27 మూవీస్.. ఆ ఒక్కటి డోంట్ మిస్

Aug 25 2025 7:45 AM | Updated on Aug 25 2025 8:47 AM

Upcoming Ott Movies Telugu August Last Week 2025

మరోవారం వచ్చేసింది. ఈసారి వినాయక చవితి పండగ కూడా ఉంది. కానీ థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. 'సుందరకాండ', 'త్రిబాణధారి బార్బరిక్', 'అర్జున్ చక్రవర్తి', 'కన్యాకుమారి' లాంటి చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. వీటిపై పెద్దగా బజ్ లేదు. జాన్వీ కపూర్ హిందీ మూవీ 'పరమ్ సుందరి' కూడా ఇదే వీకెండ్‌లో బిగ్ స్క్రీన్‌పైకి రానుంది. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 27 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి.

(ఇదీ చదవండి: జీవిత కోసం రాజశేఖర్‌ ఓవరాక్టింగ్‌.. కావాలనే గొడవ : డైరెక్టర్‌)

ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఉన్నంతలో మెట్రో ఇన్ డైనో అనే హిందీ మూవీ ఆసక్తి రేపుతోంది. దీంతో పాటు అబిగైల్, కరాటే కిడ్స్ లెజెండ్స్, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ చిత్రాలతో పాటు రాంబో ఇన్ లవ్ అనే తెలుగు సిరీస్, ఇండియన్ ఐడల్ 4 కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?

ఈ వారం రిలీజయ్యే సినిమాల జాబితా (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • అబిగైల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ఆగస్టు 26

  • క్రిస్టోఫర్ (డానిష్ మూవీ) - ఆగస్టు 27

  • కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 27

  • మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 28

  • ద థర్స్‌డే మర్డర్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28

  • మెట్రో ఇన్.. డైనో (హిందీ మూవీ) - ఆగస్టు 29

  • టూ గ్రేవ్స్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 29

  • అన్‌నోన్ నంబర్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 29

  • కరాటే కిడ్: లెజెండ్స్ (ఇంగ్లీష్ చిత్రం) - ఆగస్టు 30

అమెజాన్ ప్రైమ్

  • సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ సినిమా) - ఆగస్టు 29

హాట్‌స్టార్

  • మాల్డిటొస్ (ఫ్రెంచ్ సిరీస్) - ఆగస్టు 25

  • పటి సీజన్ 2 (పొలిష్ సిరీస్) - ఆగస్టు 26

  • థండర్ బోల్ట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 27

  • డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 28

  • మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 28

  • హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29

  • రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) - ఆగస్టు 29

సన్ నెక్స్ట్

  • మాయకూతు (తమిళ సినిమా) - ఆగస్టు 27

  • గెవి (తమిళ మూవీ) - ఆగస్టు 27

జీ5

  • సోదా (కన్నడ సిరీస్) - ఆగస్టు 29

సోనీ లివ్

  • సంభవ వివరణమ్ నలరసంఘం (మలయాళ సిరీస్) - ఆగస్టు 29

ఆహా

  • ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ షో) - ఆగస్టు 29

లయన్స్ గేట్ ప్లే

  • బెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 29

  • ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29

ఆపిల్ ప్లస్ టీవీ

  • క్రాప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29

  • షేర్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 29

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ సిరీస్) - ఆగస్టు 27

(ఇదీ చదవండి: భిక్షాటన చేశా, వేశ్యగా పని చేశా.. బిగ్‌బాస్‌లో ఛాన్స్‌: అంకిత నాయుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement