
తెలుగులో తక్కువ గానీ బాలీవుడ్‌లో కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఓ మూవీని అలానే స్ట్రీమింగ్‌కి సిద్ధం చేశారు. 'ఆదిపరుష్' దర్శకుడు ఓం రౌత్.. మరో ఇద్దరితో కలిసి నిర్మించిన కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుంది?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 27 సినిమాలు)
'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్‌పాయ్.. 'ఇన్‌స్పెక్టర్ జెండే' పేరుతో తీసిన ఈ చిత్రంలో పోలీసుగా నటించాడు. ముంబైకి చెందిన పోలీస్ అధికారి మాధవ్ జెండే జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 1970-80ల్లో మాధవ్ జెండే పనిచేస్తున్న టైంలో ఛార్లెస్ శోభరాజ్ సీరియల్ కిల్లర్‌గా వార్తల్లో నిలిచాడు. అయితే మాధవ్.. శోభరాజ్‌ని రెండుసార్లు పట్టుకున్నాడు. 1971లో తొలిసారి అరెస్ట్ చేయగా 1986లో తిహార్ జైలు నుంచి తప్పించుకున్నాడు. తర్వాత మళ్లీ గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పుడు ఈ స్టోరీని కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీశారు. డైరెక్టర్ ఓం రౌత్.. దీనికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. అయితే థియేటర్లలోకి కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 05 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే మంచి మూవీ చూడబోతున్నామనే ఫీల్ అయితే కలిగించారు. ఇది తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీలో ఛార్లెస్ శోభరాజ్ పాత్రలో 'కుబేర' ఫేమ్ జిమ్ షర్బ్ నటించడం విశేషం.
(ఇదీ చదవండి: విషాదం.. 'కేజీఎఫ్' నటుడు కన్నుమూత)