ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. | Viswanath And Sons Movie OTT Release Date Out | Sakshi
Sakshi News home page

ఓటీటీలోకి ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Sep 8 2026 1:31 PM | Updated on Sep 8 2026 1:40 PM

Viswanath And Sons Movie OTT Release Date Out

సూర్య, మమితా బైజు జంటగా నటించిన తాజా చిత్రం‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్స్‌లో రిలీజై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందకు రెడీ అయింది. సెప్టెంబర్‌ 11 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్‌  మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ కథేంటంటే.. 
సంజయ్ విశ్వనాథ్(సూర్య) ఓ వ్యాపారవేత్త, ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. 40 ఏళ్లు వయసొచ్చినా పెళ్లి చేసుకోడు. అమెరికాకి వెళ్లి  సరోగసి ద్వారా మగబిడ్డని కని స్వదేశానికి తిరిగొస్తాడు. కొన్నాళ్ల తర్వాత పిల్లాడు ఓ అరుదైన వ్యాధి బారిన పడతాడు. బోన్ మారో(ఎముక గుజ్జు) ట్రాన్స్ ప్లాంట్ అవసరమవుతుంది. దీంతో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అవసరం ఏర్పడుతుంది. అమెరికాకు తిరిగెళ్లి సరోగసి మదర్ మ్యాడీ (మమిత)ని వెతికి భారత్‌కి తీసుకొస్తాడు. సర్జరీ తర్వాత ఆమె తిరిగి వెళ్ళిపోవాలని ముందే ఒప్పందం చేసుకుంటాడు.

20 ఏళ్ల మ్యాడీ.. సంజయ్ ఇంటికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు సంజయ్ 40 ఏళ్లు వచ్చినా పెళ్లికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు? తల్లి అవసరం లేకుండా తన కొడుకును పెంచుకోగలిగాడా? మ్యాడీ ప్రేమని సంజయ్ ఎందుకు తిరస్కరించాడు? చివరకు పెళ్లి విషయంలో సంజయ్ తన ఆలోచన మార్చుకున్నాడా లేదా? అనేది మిగతా స్టోరీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement