‘దురంధర్‌’ రేంజ్‌లో ‘అరసన్‌’.. శింబు మాటలతో పెరిగిన అంచనాలు! | Simbu Arasan Set For A Grand Diwali Glimpse, Says This Film Will Have Dhurandhar Like Impact | Sakshi
Sakshi News home page

‘దురంధర్‌’ రేంజ్‌లో ‘అరసన్‌’.. శింబు మాటలతో పెరిగిన అంచనాలు!

Sep 8 2026 10:25 AM | Updated on Sep 8 2026 11:20 AM

Simbu Says Arasan Will Have Dhurandhar Like Impact

తమిళ హీరో శింబు నటిస్తున్న తాజా చిత్రం అరసన్‌. వెట్రిమారన్‌ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. నటి ప్రియాంక మోహన్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు  విజయ్‌ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు. అదేవిధంగా నటి ఆండ్రియా, సముద్రఖని, కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్ర లు పోషిస్తున్నారు.  అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌  శరవేగంగా జరుపుకుంటోంది. ఉత్తర చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌ స్టర్స్‌ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ విడుదలై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరచాలి. ముఖ్యంగా నటుడు శింబు గెటప్స్‌ ఆసక్తని రేకెత్తిస్తున్నాయి. 

కాగా ఇప్పటి వరకు అరసన్‌ చిత్రం గురించి ఎక్కడా మాట్లాడని నటుడు శింబు తొలి సారిగా ఇటీవల ఒక వేదికపై స్పందించారు.  ఆయ న పేర్కొంటూ అరసన్‌  చిన్న చిత్రం కాదు. ఇందులో నేను చిన్న వయసు నుంచి పలు వయసుల గెటప్స్‌లో కనిపిస్తాను. హిందీలో దురంధర్‌ చిత్రం ఎంత ప్రభావం చూపిందో, తమిళంలో అరసన్‌ చిత్రం అంతగా ప్రభావం చూపుతుంది. 

దర్శకుడు వెట్రిమారన్‌ పూర్తిగా దృష్టి పెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పలు యదార్థ ప్రాంతాల్లో షూటింగ్‌ నిర్వహిస్తున్నామని శింబు పేర్కొన్నారు. షూటింగ్‌ చివరి దశకు చేరుకోవడంతో, చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు శింబు చెప్పా రు. అరసన్‌ చిత్రం కచ్చితంగా తమిళ సినిమా ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అభిమానులు తమ ఖుషీ అవుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement