అదే తన లక్ష్యం అంటున్న డ్యూడ్‌ హీరోయిన్‌ | Actress Mamitha Baiju Says Her Goal Is To Win Hearts With Memorable Films, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: వెనక్కు తిరిగి చూసుకుంటే..

May 20 2026 8:28 AM | Updated on May 20 2026 11:20 AM

Actress Mamitha Baiju Reveals Her Goal

మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది హీరోయిన్‌ మమితా బైజు. మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రంతో అందరి దృష్టిని తనవైపు ఆకర్షించింది. ఆ తర్వాత కోలీవుడ్‌, టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి దక్షిణాదిలో ట్రెండింగ్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఇటీవల డ్యూడ్‌ మూవీతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఈమె విజయ్‌తో కలిసి నటించిన జననాయకన్‌ (తెలుగులో జన నాయకుడు) చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. 

అదే నా లక్ష్యం
అలాగే సూర్యకు జంటగా నటించిన 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే అశోక్‌ సెల్వన్‌కు జంటగా నటించిన ఇరండు విధానం చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రాలు విడుదలైన తర్వాత మమితా బైజు క్రేజ్‌ వేరేగా ఉంటుందని భావించవచ్చు. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా అభిమానుల గుండెల్లో నిలిచిపోయే చిత్రాలను చేయాలన్నదే నా లక్ష్యం. అలా ఒక ప్రేమైక కుటుంబాన్ని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఏదో ఒక రోజున నా జరిగిన కాలం గుర్తుకు వస్తే ఆనందం కలగాలి. అందుకోసమే నా ఈ ప్రయాణం' అని మమిత పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement