విష్ణు విశాల్‌కు జంటగా.. 'మమిత బైజూ' | Mamita Baiju Life And Success Story In Film Industry | Sakshi
Sakshi News home page

విష్ణు విశాల్‌కు జంటగా.. 'మమిత బైజూ'

Aug 1 2024 1:14 PM | Updated on Aug 1 2024 1:14 PM

Mamita Baiju Life And Success Story In Film Industry

ఏ యాక్టర్‌కైనా బ్రేక్‌ అనేది ఒక చిత్రంతోనే వస్తుంది. ఆ తరువాత వారి లైఫే మారిపోతుంది. ఇలా చాలా మంది హీరోహీరోయిన్ల జీవితంలో జరిగింది. అలా ప్రేమలు అనే మలయాళ చిత్రంతో నటి మమిత బైజూ లైఫే మారిపోయింది. ఆ చిత్రం మలయాళంలోనే కాకుండా తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లోనూ అనువాదం అయ్యి మంచి వసూళ్లను సాధించింది.

ఆ విషయం పక్కన పెడితే అందులో నాయకిగా నటించిన మమిత బైజూకు పిచ్చ క్రేజ్‌ వచ్చింది. దీంతో అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా తమిళంలో ఇప్పటికే జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు జంటగా రెబల్‌ చిత్రంలో నటించారు. తాజాగా విష్ణు విశాల్‌తో రొమాన్స్‌ చేస్తున్నట్లు సమాచారం. విష్ణు విశాల్‌ ప్రస్తుతం రామ్‌కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన రాక్షసన్‌ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.

దీంతో తాజాగా దర్శకుడు  రామ్‌కుమార్, విష్ణు విశాల్‌ కలిసి మరో చిత్రం చేస్తున్నారు. ఇందులోనే నటి మమిత బైజూ నాయకిగా నటిస్తున్నట్లు తెలిసింది. ఇది నటుడు విష్ణువిశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న 21వ చిత్రం కావడం గమనార్హం. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా నటి మమిత బైజూ దీంతో పాటు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ కేరళా కుట్టి కోలీవుడ్‌లో బాగానే పాగా వేస్తున్నారన్న మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement