ధనుశ్, మమిత బైజు జంటగా నటించిన లేటేస్ట్ మూవీ కర. ఈ సినిమాకు విఘ్నశ్ రాజా దర్శకత్వం వహించారు. ఈశారి గణేశ్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఓకేసారి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదల చేసిన మేకర్స్... తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.
'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది.. కువైట్‌లో ఉన్న వందలాది ఆయిల్ వనరులపై ఇరానా దాడులు చేసింది' అన్న డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. కర ట్రైలర్ చూస్తుంటే డబ్బు కోసం ఓ సామాన్యుడు చేసే పోరాటంగానే ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్యాంకులను కొల్లగొట్టి కోట్ల రూపాయలను దోచుకునే వ్యక్తిగా ధనుశ్ ఇందులో కనిపించారు. డబ్బు కోసం ఏదైనా చేసే దొంగ పాత్రలో ధనుశ్ కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీలో కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతమందించారు.


