'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్‌కి రెడీ | Mamitha Baiju Rebel Movie Release Date Details | Sakshi
Sakshi News home page

'ప్రేమలు' హీరోయిన్ కొత్త సినిమా.. రిలీజ్‌కి రెడీ

Mar 13 2024 8:02 AM | Updated on Mar 13 2024 10:08 AM

Mamitha Baiju Rebel Movie Release Date Details - Sakshi

'ప్రేమలు' అనే సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన మమిత బైజు.. ఇదే మూవీ డబ్బింగ్ వెర్షన్‌తో తెలుగు ప్రేక్షకుల్ని కూడా మాయలో పడేసింది. ఈమె హీరోయిన్‌గా నటించిన తమిళ సినిమా 'రెబల్'. ఇందులో జీవీ ప్రకాశ్ కుమార్ హీరో. మార్చి 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. నికేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమ్ అంతా పలు ఆసక్తికర విషయాల్ని చెప్పారు.

(ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

తమిళం గురించి బలంగా చెప్పే చిత్రం ఇది అని, దర్శకుడు నికేశ్‌ తన ఫ్యామిలీ ఫ్రెండ్ జీవితంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఓ కథ రాసుకున్నాడని, అలా తీసిన సినిమానే 'రెబల్' అని హీరో జీవీ ప్రకాశ్ కుమార్ చెప్పారు. ఇందులో హీరోయిన్‌గా మమితా బైజూ చాలా చక్కగా నటించిందని చెప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన అనుష్క.. ఇంతలా మారిపోయిందేంటి!?)

Advertisement
 
Advertisement
Advertisement