ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్ | Premalu Movie Mamitha Baiju Childhood Pics And Family Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: చిన్న వయసులోనే స్టార్ అయిపోయింది.. తెలుగులోనూ ఆఫర్స్?

Published Mon, Apr 29 2024 2:23 PM | Last Updated on Mon, Apr 29 2024 2:23 PM

Premalu Movie Mamitha Baiju Childhood Pics And Family Details

హీరోయిన్ కావాలంటే గ్లామర్ చూపించాలి. డ్యాన్స్ చేయాలి. అందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ వాటితో అవసరం లేకుండా కొందరు స్టార్స్ అవుతుంటారు. ఈ పాప కూడా అదే కేటగిరీలోకి వస్తుంది. ఎందుకంటే సహాయ నటిగా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. ఈ మధ్య ఓ మూవీతో హిట్ కొట్టి కుర్రాళ్ల క్రష్ అయిపోయింది. మరి ఇంతలా చెప్పాం కదా.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న పాప పేరు మమిత బైజు. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. రీసెంట్‌గా 'ప్రేమలు' సినిమాలో హీరోయిన్ ఈమెనే. ఇది మమిత చిన్నప్పటి ఫొటో. ఇందులో నాన్నతో కలిసి అమాయకంగా చూస్తోంది కదా! చిన్నప్పటి నుంచి అదే క్యూట్‌నెస్ మెంటైన్ చేస్తూ వచ్చింది. సేమ్ ఇలాంటి ఫొటోనే ఇప్పుడు కూడా ఒకటి తీసుకుంది. దిగువన ఉన్న ఫొటో అదే.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)

కేరళలోని కిడంగూర్ అనే ఊరిలో పుట్టి పెరిగిన మమిత.. ప్రస్తుతం సైకాలజీ డిగ్రీ చదువుతోంది. ఓవైపు చదువుతూ మరోవైపు సినిమాల్లో నటించేస్తోంది. 2017లో 'సర్వోపరి పాలక్కరన్' అనే మలయాళ మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది. అనంతరం పలు చిత్రాలు చేసింది. కానీ 'కోకో' అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈమెకు గుర్తింపు దక్కింది. 'సూపర్ శరణ్య', 'ప్రణయ విలాసం' చిత్రాలతో హీరోయిన్ అయిపోయింది. 'ప్రేమలు'తో సోలో హీరోయిన్‌గా సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.

మమిత బైజు వ్యక్తిగత విషయానికొస్తే.. తండ్రి డాక్టర్, తల్లి హౌస్ వైఫ్, ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈమె వయసు 22 ఏళ్లే. కాబట్టి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అలానే 'ప్రేమలు' హిట్ వల్ల విజయ్ దేవరకొండ కొత్త మూవీలోనూ హీరోయిన్ ఛాన్స్ వచ్చిందని అన్నారు. కానీ అందులో నిజం లేదని తెలిసిపోయింది. 

(ఇదీ చదవండి: క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement