క్యూటెస్ట్ వీడియో.. అక్కతో మహేశ్ బాబు ఫన్ మూమెంట్స్ | Mahesh Babu And Manjula In A Wedding Hyd Video Latest | Sakshi
Sakshi News home page

Mahesh Babu: తెగ వైరల్ అయిపోతున్న మహేశ్ వీడియో.. స్పెషల్ ఏంటంటే?

Apr 29 2024 9:36 AM | Updated on Apr 29 2024 9:36 AM

Mahesh Babu And Manjula In A Wedding Hyd Video Latest

సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇ‍ప్పుడు రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే తన లుక్ అంతా మార్చే పనిలో ఉన్నాడు. అయితే షూటింగ్ కి ఇంకా టైమ్ ఉండటంతో ప్రస్తుతం ఫ్యామిలీతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ క్యూట్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?)

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నాసరే మహేశ్ తన ఫ్యామిలీతో ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటాడు. తాజాగా అలా కూతురు సితారతో కలిసి హైదరాబాద్‌లో జరిగిన ఓ పెళ్లికి వెళ్లాడు. ఈ వేడుకకు మహేశ్ అక్క మంజులు కూడా వచ్చింది. తమ్ముడితో సరదా కబుర్లు చెబుతూ పొడుగు జుత్తు గురించి అడిగింది. అలా అక్క-తమ్ముడు కలిసి చాలా సరదాగా కనిపించారు. ఇప్పుడీ వీడియోనే వైరల్ అవుతోంది.

మరోవైపు ఇదే పెళ్లికి వచ్చిన ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.. మహేశ్ బాబుని పలకరించారు. మహేశ్, అతడి కూతురు సితారతో కలిసి ఫొటో కూడా తీసుకున్నారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో అభిమానులకు తెగ నచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక)

 

Advertisement
 
Advertisement
Advertisement