ఆ పని చేయడం బాగా అలవాటైపోయింది: మమితా బైజు | Mamitha Baiju: Interesting Details About Premalu Beauty | Sakshi
Sakshi News home page

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీ పారితోషికం ఎంతో తెలుసా? ఆ హీరోనే ఫేవరెట్‌..

Apr 13 2025 11:32 AM | Updated on Apr 13 2025 11:50 AM

Mamitha Baiju: Interesting Details About Premalu Beauty

ఒకే ఒక్క డబ్బింగ్‌ సినిమా ‘ప్రేమలు’తో తెలుగు ఆడియన్స్‌లో కూడా విపరీతమైన ఫాలోయింగ్‌ తెచ్చుకున్న మమితా బైజు (Mamitha Baiju) గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. తండ్రి బైజు కృష్ణన్‌– డాక్టర్‌. తల్లి హోమ్‌ మేకర్‌. మిథున్‌ అనే అన్నయ్య ఉన్నాడు. తన పదహారవ ఏట– ‘సర్వోపకారి పాలక్కారన్‌’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సైకాలజీ చదువుతూ, మధ్యలో ఆపేయడం వల్ల ఏమో.. కనబడ్డ ప్రతి ఒక్కరి సైకాలజీ స్టడీ చేయడం అలవాటైపోయింది తనకు.

మలయాళంలోనే..
తెలుగులో మమితా డైరెక్ట్‌ సినిమా ఎప్పుడు చేస్తుందని ఆమె ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. రవితేజ సరసస నటిస్తుందని వార్తలు వచ్చాయి కాని, అవన్నీ వట్టి రూమర్లే అని తేలిపోయింది. ‘ప్రేమలు’ సినిమాతో ఇతర భాషల్లో కూడా మంచి క్రేజ్‌ వచ్చింది. కాని, మలయాళంలో తప్ప మిగిలిన భాషల్లో చేయడానికి ఇష్టపడటం లేదు మమితా. 

శ్రీలీల పాత్రలో..
తమిళంలో విజయ్‌ చిట్టచివరి సినిమా ‘జన నాయగన్‌’లో మమితా బైజు ఓ ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ చేస్తోంది. ఇంకా చెప్పాలంటే కూతురిలాంటి పాత్ర. ఈ సినిమా ‘భగవంత్‌ కేసరి’ రీమేక్‌ అంటున్నారు. తెలుగులో శ్రీలీల చేసిన పాత్ర తమిళంలో మమితా బైజు చేస్తోంది. మొదటి రోజు షూటింగ్‌లో విజయ్‌ని చూడగానే చాలా థ్రిల్‌ ఫీలయ్యానంటుంది మమితా. విజయ్‌ డైరెక్ట్‌గా తన దగ్గరికి వచ్చి హగ్‌ చేసుకుని, ‘ఏమ్మా ఎలా ఉన్నావు’ అని పలకరించినప్పుడు, ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కినంత ఆనందం కలిగింది అని చెప్పింది. 

ప్రేమలు పారితోషికం ఎంతంటే?
తన బ్యాగ్‌లో ఎప్పుడూ రంగు రంగుల మట్టి గాజులు , ఓ జత స్పేర్‌ డ్రెస్, చాక్లెట్లు ఉంటాయని చెప్పింది. రోజూ జిమ్‌ చేయడం అలవాటు. ‘హెలెన్‌’, ‘కప్పెలా’ మలయాళ సినిమాలతో పాపులర్‌ అయిన అన్నా బెన్‌ జిమ్‌ మేట్‌. ఇద్దరూ కలిసి వర్కవుట్స్‌ చేయడం ఫన్నీగా ఉంటుంది. చాలా ఎంజాయ్‌ చేస్తాను అని చెప్పింది. ‘ప్రేమలు’ సినిమాకి రూ. 30 లక్షలు ఇచ్చారు. సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో తన పారితోషికం రూ. 50 లక్షలకు పెంచింది. వేరే లాంగ్వేజెస్‌కి వెళ్తే, ఇంకా పెరుగుతుంది కాని, మలయాళంలో కంఫర్ట్‌ లెవెల్‌ ఎక్కువ అంది. 

ఆ హీరోనే ఫేవరెట్‌
యూత్‌కి ఫేవరెట్‌ క్రష్‌ అయిన మమితాకి మాత్రం హృతిక్‌ రోషన్, షారుఖ్‌ ఖాన్‌ అంటే పిచ్చి. తమిళ డైరెక్టర్‌ బాలతో ఓ సినిమా కమిట్‌ అయింది మమితా. కాని మధ్యలోనే సినిమా నుంచి బయటికి వచ్చింది. షూటింగ్‌లో బాల మమితాని బూతులు తిట్టి కొట్టాడని, అందుకే మానేసిందని వార్తలు వచ్చాయి. మమితా మాత్రం తన పర్సనల్‌ రీజన్స్‌ వలన ఆ సినిమా మానేసిందని చెప్పింది. తనని బాల కొట్టలేదని, అది మీడియా క్రియేషన్‌ అని కామెంట్‌ చేసింది. బాల మాత్రం మమితా తన కూతురులాంటిదని, తన డ్రెస్‌ సెన్స్‌ నచ్చక తీసేశానని చెప్పాడు.

చదవండి: సినిమాల్లోకి రావాలని చాన్నాళ్లుగా వెయిటింగ్‌. అంటోన్న ఖుష్బూ కూతురు

Advertisement
 
Advertisement
Advertisement