తెలుగు సినిమాల్లో హీరోయిన్లు అనగానే అయితే ముంబై నుంచి వస్తారు లేదంటే మలయాళ భామలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్లే సాయిపల్లవి, కీర్తి సురేశ్ లాంటి కేరళ కుట్టీలు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు మమిత బైజు లాంటి యంగ్ బ్యూటీస్ కూడా అవకాశాలు చేజిక్కుంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే మమిత దగ్గరకు ఓ ఊహించని అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'పెద్ది' నుంచి క్రేజీ సాంగ్ రిలీజ్)
'బలగం'తో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు.. అద్భుతమైన హిట్ కొట్టాడు. ఇది జరిగి చాన్నాళ్లయిపోయింది. తర్వాత 'ఎల్లమ్మ' పేరుతో ఓ సినిమా తీయాలి. అయితే ఇందులో నటించే హీరో ఎవరనే దగ్గర ఏళ్లు గడిచిపోయాయి. తొలుత నాని అనుకున్నారు కుదర్లేదు. తర్వాత నితిన్, శర్వానంద్ పేర్లు వినిపించాయి. చివరకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇతడు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.
హీరో ఎవరో తేలిపోయింది ఇక హీరోయిన్ సంగతి చూద్దాం అని మూవీ టీమ్ అనుకున్నారు. సాయిపల్లవి, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకుర్, భాగ్యశ్రీ.. ఇలా చాలా పేర్లు వినిపించాయి. ఇప్పుడీ లిస్టులోకి మలయాళ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు వచ్చి చేరింది. ఒకవేళ ఈ పాత్ర గనుక ఈమె చేస్తే బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 'ఎల్లమ్మ'లో హీరోయిన్ పాత్రకు ఫెర్మార్మ్ చేసే స్కోప్ ఎక్కువుంది. మరి ఆ ఛాన్స్ మమితకు దక్కుతుందా? వేరే ఆప్షన్ ఏమైనా చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. దిల్ రాజు దీనికి నిర్మాత.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లో 16 సినిమాలు స్ట్రీమింగ్)


