
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది.
భావోద్వేగం..
అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్‌తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.