ధనుష్, మమితా బైజు జంటగా విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘కర’. డా.ఇషారి కె.గణేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ కానుంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలో ‘కర’ సినిమాను సీహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర రిలీజ్ చేస్తున్నారు. కేఎస్ రవికుమార్, జయరామ్, సూరజ్ వెంజరమూడు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


