సాక్షి, పశ్చిమగోదావరి : ఇరగవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఐతంపూడి లాకులు వద్ద వేగంగా వస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు కాలువలో చెట్టుకొమ్మ పట్టుకొని కేకలు వేయగా అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆయనను రక్షించారు.
పెరవలిలో వివాహానికి వెళ్లి ఓగిడి నుండి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన వారి వివరాలు .పోతుల లక్ష్మి బాను (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుస్వంత (18), నాగా బత్తుల సాయి సూర్య (19)గా గుర్తించారు. కాలువలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


