కర్ణాటక సంక్షోభంపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మౌనం వీడారు. అక్కడి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం సిద్ధరామయ్య– డిప్యూటీ డీకే శివకుమార్ మధ్య జరుగుతున్న కుర్చీలాట సమస్యను పరిష్కరించడం తనవల్ల సాధ్యపడదని పరోక్షంగా విచారం వ్యక్తంచేశారు.
‘మీరు (మీడియా) మూడ్రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తోంది. ఎందుకంటే ఏ విషయం లేకుండా నేను చెప్పడం మంచిది కాదు. నా దగ్గర చెప్పేందుకు ఏమీలేదు’ అని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి జరిగే పక్షంలో సీఎం రేసులో తాను కూడా ఉంటానని సీనియర్ మంత్రి జి. పరమేశ్వర్ ఆదివారం పేర్కొన్నారు.


