సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య | karnataka husband and wife incident | Sakshi
Sakshi News home page

సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య

Nov 23 2025 1:17 PM | Updated on Nov 23 2025 1:17 PM

karnataka husband and wife incident

ఏడేళ్ల తరువాత భార్య గుట్టురట్టు 

బెంగళూరు: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ కిల్లర్స్‌కి డబ్బులు ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య ఉదంతం 7 ఏళ్లకు గుట్టురట్టయింది. ఈ సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. వివరాలు... కలబుర్గి తాలూకా కణ్ణి గ్రామం నివాసి భీరప్ప 7 ఏళ్ల క్రితం చనిపోయాడు. సహజ మరణంగా భావించి అంత్యక్రియలు జరిపించారు. అయితే  ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వెలుగు చూడడంతో హత్యగా తేలింది. 

భీరప్ప భార్య శాంతాబాయి, మహేశ్, సురేశ్, సిద్ధు, శంకర్‌ అనే వ్యక్తులకు సుపారి ఇచ్చి భర్తను హత్య చేయించింది. ప్రధాన నిందితుడు మహేశ్‌కు శాంతాబాయితో అక్రమ సంబంధం ఉంది. తమకు భర్త అడ్డుగా ఉన్నాడని భార్య, ఆమె ప్రియుడు భావించారు. అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. శాంతాబాయి తన భర్తను హత్య చేయాలని మాట్లాడిన దృశ్యాలను ప్రియుడు మహేశ్‌ తన మొబైల్లో వీడియో తీసి పెట్టుకున్నాడు. ఇటీవల సదరు వీడియో లీక్‌ కావడంతో వైరల్‌గా మారింది. దీంతో భీరప్ప తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఐదుమంది నిందితులను అరెస్టు చేశారు. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement