
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ‘‘నేను ఖర్గేతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాను. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు పొందాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు
కాగా, మల్లికార్జున ఖర్గేకు బుధవారం రాత్రి బెంగళూరు ఆస్పత్రి వైద్యులు పేస్‌మేకర్‌ను అమర్చారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బెంగళూరు వచ్చిన ఆయన శ్వాసలో ఇబ్బంది, జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించారు.
Spoke to Kharge Ji. Enquired about his health and wished him a speedy recovery.
Praying for his continued well-being and long life.@kharge— Narendra Modi (@narendramodi) October 2, 2025
తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియా లో..‘వయో సంబంధ సమస్యలు, శ్వాస సంబంధ సమస్యలతో ఖర్గే ఇబ్బంది పడుతున్నారు. వీటిని సరిచేసేందుకు పేస్‌మేకర్ అమర్చాలని వైద్యులు సలహా ఇచ్చారు’అని తెలిపారు. ఖర్గేకు బుధవారం రాత్రి వైద్యులు స్వల్ప శస్త్రచికిత్స జరిపి పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చారు. ఆయన ఆరోగ్యం బాగుందని, గురువారం డిశ్చార్జి అవుతారని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.