Mallikarjun Kharge: ఎదురొడ్డి నిల్చున్నారు | Kharge heaps praise on Rahul while greeting him on his birthday | Sakshi
Sakshi News home page

Mallikarjun Kharge ఎదురొడ్డి నిల్చున్నారు

Jun 20 2024 6:01 AM | Updated on Jun 20 2024 6:01 AM

Kharge heaps praise on Rahul while greeting him on his birthday

జన్మదిన వేడుకల్లో రాహుల్‌ను పొగడ్తల్లో ముంచెత్తిన కాంగ్రెస్, ‘ఇండియా’ నేతలు

న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రబోధించిన అంకితభావం, విలువలున్న రాహుల్‌ గాంధీ దేశంలో తమ వాణిని వినిపించలేకపోయిన కోట్లాది మందికి గొంతుకగా మారారని రాహుల్‌ను కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే పొగడ్తల్లో ముంచెత్తారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్‌ 54వ పుట్టినరోజు వేడుకను పార్టీ కీలక నేతలు జరిపారు. 

ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, కోశాధికారి అజయ్‌ మాకెల్‌ తదితరుల సమక్షంలో రాహుల్‌ కేక్‌ కట్‌చేశారు. పెద్దసంఖ్యలో అక్కడికొచ్చిన కార్యకర్తలు రాహుల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవద్దని సామాజిక, దాతృత్వ కార్యక్రమాల్లో నిమగ్న మవ్వాలని పార్టీ కార్యకర్తలకు రాహుల్‌ పిలుపునిచ్చారు. 

‘‘ కాంగ్రెస్‌ పాటించే సామరస్యం, భిన్నత్వంలో ఏకత్వం, తపన అన్నీ మీలో ప్రతిబింబిస్తున్నాయి. ప్రతి ఒక్కరి కన్నీటి కష్టాలు తుడిచేసి సత్యానికి ఉన్న శక్తిని చాటుతున్నారు’ అని ఖర్గే ‘ఎక్స్‌’లో ట్వీట్‌చేశారు. ‘‘ నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం కోసం పరితపించే విలక్షణమైన వ్యక్తి, నా స్నేహితుడు, మార్గదర్శకుడు, నేత’ అంటూ ప్రియాంకా ట్వీట్‌చేశారు. 

‘‘ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రజల పట్ల మీకున్న అంకితభావం దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని తమిళనాడు సీఎం స్టాలిన్‌ ట్వీట్‌చేశారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్‌ శరద్‌ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement