జీ రామ్ జీ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలపై చర్చించే అవకాశం
దేశ రాజకీయ పరిస్థితులు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై కూడా..
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పేరుతో తెచి్చన కొత్త చట్టంతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనుంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో అక్కడి వైఫల్యాలపైనా చర్చించే అవకాశాలున్నాయి.
వచ్చే ఏడాది జరుగనున్న పశి్చమబెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పారీ్టలతో పొత్తుల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను భేటీలో విశ్లేíÙంచనున్నారు.
దీంతో పాటే యూపీఏ ప్రభుత్వం తీసుకువచి్చన నరేగా పథాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా తెచ్చి జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తెచి్చన నేపథ్యంలో, దీనిపై. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై భేటీలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిరసనలపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి సభ్యుల నుంచి ప్రతిపాదనలు కోరనున్నట్లు తెలిసింది. కొత్త చట్టంపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ తీసుకునే కార్యాచరణ కీలకం కానుంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహా ఢిల్లీకి చేరుకున్నారు.


