సాక్షి, చిత్తూరు: చిత్తూరు నియోజకవర్గం టీడీపీ మహిళా విభాగం నేత దమయంతి లీలావతి తనను వేధింపులకు గురిచేసిందంటూ ముంబైకు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అనురూప ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో ఎక్కువ జీతం ఇస్తామని చిత్తూరుకు పిలిచారన్న అనురూప.. డిజైనింగ్ పనులతో పాటు ఇంటి, వంట పనులు చేయించారని ఆరోపించారు.
చిత్తూరులో ఆకృతి బోటిక్ నిర్వహిస్తున్న లీలావతి.. అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తామని తీసుకువచ్చి.. జీతం చెల్లించకుండా మానసిక వేధింపులకు గురిచేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లీలావతి, ఆమె కుమారుడు అనుష్ చౌదరి టార్చర్ చేశారంటూ.. కన్నీటి పర్యంతమైన అనురూప వీడియో కలకలం రేపుతోంది.


