తాడేపల్లి: కూటమి ప్రభుత్వం పాలనాపరంగా అన్ని విధాలా ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ము,దైర్యం ఉంటే వైసీసీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండని అన్నారు. అసెంబ్లీకి వస్తే వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తారని ప్రభుత్వానికి భయమని చెప్పారు.
తాడేపల్లిలో బుధవారం వరుదు కల్యాణి మాట్లాడుతూ... ‘‘మహిళా హోం మంత్రి ఉన్నప్పటికీ రాష్ట్ర మహిళలపై దాడులు చేసినా, బట్టలు విప్పి కొట్టినా అనిత పట్టించుకోదు. చట్టాలు ఉన్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది. అనితకు ఎంత దమ్ము ఉందో ప్రజలకు తెలిసిపోయింది. కౌన్సిల్ లో అన్ని అంశాలపై హోం మంత్రి అనితను ప్రశ్నిస్తాం. డీఎస్సీలో అక్రమాలు జరిగినా సీబీఐ ఎంక్వయిరీ వేయటం లేదు. మీ అక్రమాలు బయటకు వస్తాయని మీకు భయం. అందుకే వైఎస్ జగన్ అసెంబ్లీ వస్తే అడుగుతారని మీకు భయం’’ అని చెప్పారు.


