అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ! | Man Arrested For Stealing Married Woman Undergarments Over One Sided Love In Ujjain, More Details Inside | Sakshi
Sakshi News home page

అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ!

Mar 14 2026 9:36 AM | Updated on Mar 14 2026 9:43 AM

Man Arrested for Stealing Neighbours Undergarments

ఉజ్జయిని: ఒక వివాహితపై మనసు పడిన ప్రబుద్ధుడు.. ఆమెపై ఉన్న పిచ్చితో వికృత చేష్టలు మొదలుపెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఉజ్జయినిలోని చిమన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాంచా భవన్ ప్రాంతంలో ఒక కుటుంబం నివాసముంటోంది.

ఎవరూ లేరని నిర్ధారించుకుని..
గత కొంతకాలంగా రాత్రిపూట ఇంటి బయట తీగపై ఆరవేసిన మహిళ లోదుస్తులు మాయమవుతుండటాన్ని ఆ కుటుంబ సభ్యులు గమనించారు. వరుసగా ఇదేవిధంగా జరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ ఇంట్లోనివారు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఒక యువకుడు నెమ్మదిగా ఇంటి వద్దకు రావడం, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక తీగ మీద ఉన్న మహిళ లోదుస్తులను తీసుకుని అక్కడి నుంచి పరారవ్వడం క్లియర్‌గా  ఆ సీసీటీవీలో కనిపించింది. బాధితులు వెంటనే ఆ ఫుటేజీని పోలీసులకు అందజేసి, ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.

వీర ‍ప్రేమకు గుర్తుగా ఛాతీపై టాటూ
సీసీటీవీ ఆధారంగా పోలీసులు అదే ప్రాంతానికి చెందిన అంకిత్ మాలవీయ (25) అనే యువకుడిని అదుపులోనికి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు సైతం షాక్‌ అయ్యారు. తనకు ఆ వివాహిత అంటే అంతులేని అని, ఆమెపై ఉన్న వన్ సైడ్ లవ్‌తోనే ఆమె లోదుస్తుల చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. అతను ఆమె పేరును ఛాతీపై టాటూగా కూడా వేయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: షాకిస్తున్న లేటెస్ట్ సర్వే రిపోర్ట్ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement