వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు | Vinayaka Chavithi Celebrations At YSRCP Central Office | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో చవితి వేడుకలు

Aug 22 2020 11:50 AM | Updated on Aug 22 2020 6:14 PM

Vinayaka Chavithi Celebrations At YSRCP Central Office - Sakshi

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి నారుమల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు.

ఆ ఘనత సీఎం జగన్‌దే: లేళ్ల అప్పిరెడ్డి
పూజ కార్యక్రమం అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగడం లేదన్నారు. ఇచ్చిన హామీలన్ని ఏడాదిలోపు పూర్తి చేసిన ఘనత  సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. సీఎం జగన్‌ చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తలపెట్టే విఘ్నాలు తొలగిపోయేలా సీఎం జగన్‌కు వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement