
వినాయక చవితి అంటే పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన పండుగ. నేడు (ఆగస్టు 27) గణపయ్యను ప్రతిష్టించి పూజ చేస్తారు. భక్తిశ్రద్ధలతో పూలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి భగవంతుడిని పూజిస్తారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి నటి అనసూయ వరకు పలువురు తారలు గణపతి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హారతి పడితే.. నాని కుమారుడు గణపతి పాట పాడాడు, హన్సిక భర్తతో కాకుండా ఒంటరిగా పూజ చేసింది. ఇంకా ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింది పోస్టుల్లో మీరే చూసేయండి..