డీజే సౌండ్‌తో వ్యక్తి మృతి! | Elderly Man Dies of Heart Attack During Ganesh Immersion in Endada | Sakshi
Sakshi News home page

డీజే సౌండ్‌తో వ్యక్తి మృతి!

Sep 21 2026 4:47 AM | Updated on Sep 21 2026 4:48 AM

Elderly Man Dies of Heart Attack During Ganesh Immersion in Endada

కొమ్మాది(విశాఖ): వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం 8వ వార్డు ఎండాడ బీసీ కాలనీలోని యూత్‌ ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు నిర్వహించిన వినాయక చవితి వేడుకల అనంతరం శనివారం రాత్రి నిమజ్జన ఊరేగింపు చేపట్టారు. 

ఈ సందర్భంగా డీజే ఏర్పాటు చేయగా స్పీకర్లు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగాయి. అదే ప్రాంతానికి చెందిన రెడ్డిపిల్లి శంకర్రావు (62) శబ్దానికి ఉలిక్కిపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  డీజే శబ్దం కారణంగానే ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యు­లు అనుమానిస్తున్నారు. పీఎం పాలెం పోలీసులు ఘటనపై వివరాలు సేకరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement