మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న డి.రాజేంద్ర వర్మ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా మరోసారి ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోసారి అధ్యక్షుడిగా, సీసీఎల్‌ఏ కార్యాలయంలో అడిషనల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న చేబ్రోలు కృష్ణమూర్తి మూడోసారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి విశాఖపట్నం జిల్లా చైర్మన్ సత్తి నాగేశ్వరరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఎ.త్రినాథరావు, కార్యదర్శి పి.శ్యాం ప్రసాద్, కోశాధికారి జి.రాజేష్, పి.సుధీర్, యోగి, వి.వరుణ్, గౌతమ్ తదితరులు రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం మరింత సమర్థవంతంగా కృషి చేయాలని నాగేశ్వరరెడ్డి ఆకాంక్షించారు.


