అల్లిపురం: నగరంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ సికింద్రాబాద్’ చిత్ర బృందం సందడి చేసింది. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా 50 మంది నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యువత మాదకద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. సామాజిక సందేశంతో రూపొందిన సినిమాలు యువతలో మార్పుకు దోహదపడతాయని అన్నారు.చిత్ర బృందం సభ్యులు ఇమ్రాన్, హర్ష సాయి మాట్లాడుతూ యువత, తల్లిదండ్రులు చిత్రాన్ని ఆదరించాలని కోరారు. మహిళా సాధికారతలో భాగంగా కుట్టు మిషన్లు అందించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మానసిక దివ్యాంగులకు సత్కారం చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ మణి డి అపెక్స్, నటీనటులు కట్టప్ప, గోపాల్, హర్ష, చింటూ, సలీం, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


