ఎంవీపీ కాలనీ: లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఎంవీపీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ డెయిరీఫారం ఆదర్శనగర్‌కు చెందిన చింతాడ శ్రీదేవి (40) కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. ఆదివారం ఉదయం మార్కెట్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమె ఇసుకతోటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వైపు వెళ్తున్న ఏపీ 35వై 4445 నంబరు గల లారీ పెట్రోల్ బంక్‌లోకి వెళ్లే క్రమంలో శ్రీదేవిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త తమ్మినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పైడి నాయుడు అజాగ్రత్తగా వాహనం నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.


