పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఆదివారం రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం పోటీలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక బ్రాడీపేట బైపాస్ రోడ్డులో యూరోకిడ్స్‌లోని అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాదాసు కిశోర్ మాట్లాడుతూ పోటీలకు ఆరు జిల్లాల నుంచి 67 మంది క్రీడాకారులు హాజరైనట్టు చెప్పారు. పోటీల్లో చొప్పా వీర వెంకట వివేశ్ (ఏలూరు జిల్లా), ఆముదాలపల్లి పూజిత (పశ్చిమగోదావరి), పినిశెట్టి ధరణి (కోనసీమ), కొట్టాల గీతశ్రీ (అనకాపల్లి), ఎం.మౌర్యసూర్య (పశ్చిమగోదావరి) మొదటి ఐదు స్థానాల్లో నిలిచారన్నారు. విజేతలకు రూ.30 వేల నగదు బహుమతులు అందించినట్టు తెలిపారు. యూరోకిడ్స్ డైరెక్టర్ మద్దుల రాజేష్ పాల్గొన్నారు.


