మహారాష్ట్రలోని అష్టగణపతి ఆలయాల గురించి మీకు తెలుసా?

Ashtavinayaka Temples In Maharashtra - Sakshi

గణపతి ఉపాసనకు మహారాష్ట్ర పెట్టింది పేరు. దానికి తగ్గట్టుగానే ఆ రాష్ట్రంలో గణపతి క్షేత్రాలు కోకొల్లలు. వాటన్నిటిలోకి అష్టగణపతి క్షేత్రాలుగా ప్రాముఖ్యం సంతరించుకున్న ఎనిమిది క్షేత్రాలు గణాధిపత్యులకు ముఖ్యమైనవి. ఈ ఎనిమిదీ ‘అష్టగణపతి క్షేత్రాలు‘గా ప్రసిద్ధికెక్కాయి.

1. మయూరేశ్వర గణపతి – పూనా జిల్లాలో పూనా నుండి నలభై మైళ్ళ దూరంలో నున్న ’మోరగావ్‌’లో మయూరేశ్వర గణపతి ఆలయం ఉంది.

2. చింతామణి గణపతి – పూనా నుండి పధ్నాలుగు మైళ్ళదూరంలో నున్న ’థేపూర్‌’ చింతామణి గణపతి క్షేత్రం.

3. గిరిజాత్మజ గణపతి – పూనా నుండి అరవై మైళ్ళదూరంలో నున్న ’లేహ్యాద్రి’ అనే స్థలంలో గిరిజాత్మజ గణపతి క్షేత్రం వెలిసింది.

4. శ్రీ విఘ్నేశ్వర గణపతి – లేహ్యాద్రి సమీపంలోనే ’ఓఝల్‌’ స్థలంలో ’శ్రీవిఘ్నేశ్వర’ క్షేత్రం వెలిసింది.

5. మహోత్కట గణపతి – పునానుండి 32 మైళ్ళ దూరంలో ’’రాజన్గావ్‌’’లో మహోత్కట గణపతి ఆలయం ఉంది.

6. భల్లాలేశ్వర గణపతి – మహారాష్ట్రలోని కులాబా జిల్లాలో ’పాలీ’ అనేచోట భల్లాలేశ్వర గణపతి క్షేత్రం ఉంది.

7. వరదవినాయకుడు  – కులాబా జిల్లాలో ’’మహర్‌’’ అనే స్థలంలో ’’వరదవినాయక’’ ఆలయం ఉంది.

8. సిద్ధివినాయకుడు – అహ్మద్‌ నగర్‌ జిల్లాలో ’’సిద్ధటేక్‌’’ అనే స్థలంలో సిద్ధివినాయక క్షేత్రం వెలిసింది...!! 
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top