
ఖైరతాబాద్ : 69 అడుగుల ప్రతిమ.. విశ్వశాంతి మహాశక్తికి ప్రతీక..భక్తజనులు భారీగా తరలారు.. చూడాలని తలచారు..చూసి తరించారు.

గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఖైరతాబాద్ వినాయకుడి దివ్యదర్శనం కోసం హైదరాబాద్ నలుదిక్కుల నుంచి భక్తులు తండోపతండాలుగా కదిలివచ్చారు.

పంచముఖ నాగేంద్రుడి నీడన కొలువుదీరిన మూడు ముఖాల గణేశుడిని కనులారా వీక్షించారు. మనసారా ఆనందపరవశమయ్యారు.











