ఏపీలో భారీ వర్షాల.. వరదల్లో కొట్టుకుపోయిన కారు | Depression over the Bay of Bengal AP Heavy Rains Live Updates | Sakshi
Sakshi News home page

ఏపీలో భారీ వర్షాల.. వరదల్లో కొట్టుకుపోయిన కారు

Sep 24 2026 7:11 AM | Updated on Sep 24 2026 9:07 AM

Depression over the Bay of Bengal AP Heavy Rains Live Updates

ఏపీలో భారీ వర్షాలు అప్‌డేట్స్‌.. 

విజయవాడ..

  • ఉధృతంగా ప్రవహిస్తున్న పెదవాగు.
  • వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు.
  • కారులో ఉన్న వారికి రక్షించిన స్థానికులు.
  • సామ్రాజ్య రిసార్ట్‌ వంతెనకు కోత, నిలిచిన రాకపోకలు. 

శ్రీకాకుళం..

  • శ్రీకాకుళం-కళింగపట్నం మార్గంలో నిలిచిన రాకపోకలు ..
  • కళింగపట్నం ప్రధాన మార్గంలో కూలిన భారీ వృక్షాలు..
  • శ్రీకాకుళం అంతటా భీకర గాలులు..

పోలవరం జిల్లా..‌

  • చింతూరు ఏజెన్సీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు...
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న అన్నవరం వాగు, చీకటి వాగు, సోకిలేరు, కొండ్రాజుపేట, చంద్రవంక వాగులు..
  • పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం....
  • భారీ వర్షాల దృష్ట్యా పర్యాటక ప్రదేశాలను మూసివేసిన అధికారులు..
  • వర్షాలు తగ్గేంత వరకు పర్యాటకం నిలిపివేత..
  • రెండో రోజు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు..

తూర్పుగోదావరి జిల్లా...

  • జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..
  • పలు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీరు
  • రైల్వే స్టేషన్‌కి వెళ్లే ప్రధాన రహదారి నీట మునగడంతో రాకపోకలకు తీవ్రత అంతరాయం..
  • భారీ వర్షంతో కాలువలు నుండి వీధిల్లోకి చొచ్చుకొచ్చిన మురుగు నీరు
  • కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్ ఆర్యాపురం తుమ్మలోవ ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీరు
  • అనపర్తి నియోజకవర్గంలో భారీ వర్షం...
  • స్తంభించిన జనజీవనం.
  • అనపర్తి మెయిన్ రోడ్డులో రోడ్డుకు అడ్డంగా బిల్డింగ్‌పై పడిన భారీ వృక్షం.
  • ట్రాఫిక్‌కి అంతరాయం.. రాత్రి నుండి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

 

👉తీవ్ర వాయుగుండం తీరం దాటిన తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. డా. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

విశాఖ..

  • ఉమ్మడి విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం.
  • రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం.
  • భారీ వర్షాలకు ఏజెన్సీలో పొంగి ప్రవర్తిస్తున్న వాగులు వంకలు.
  • అగినంపూడి హైవేపై పడ్డ భారీ వృక్షం.
  • జలమయమైన అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్.
  • అనకాపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా చేరిన వర్షపు నీరు..
  • అల్లకల్లోలంగా  మారిన సముద్రం.
  • మరొక మూడు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఆదేశం.

భోగాపురంలో నో ల్యాండింగ్‌.. 

  • భారీ వర్షాల కారణంగా భోగాపురంలో ల్యాండ్ కాలేకపోయిన ఎయిర్ ఇండియా IX-1373 విమానం

  • బుధవారం రాత్రి 8:35కు విజయవాడ నుండి భోగాపురం బయలుదేరిన విమానం

  • బుధవారం రాత్రి 9:40 గంటలకు భోగాపురంలో ల్యాండ్ అవ్వాల్సిన విమానం

  • భోగాపురంలో వర్షం కారణంగా సిగ్నల్ వ్యవస్థ పని చేయకపోవడంతో విమానం దారి మళ్లింపు

  • విమానంలో ఉన్న మంత్రులు అచ్చెంనాయుడు , కొండపల్లి శ్రీనివాస్, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, బొత్స అనూష.

  • రెండు గంటల ఉత్కంఠ తర్వాత నాగపూర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అవటంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

  • గురువారం తెల్లవారుజామున 2.20 గంటలకు నాగపూర్ నుంచి బెంగళూరు బయలుదేరిన ఎయిర్ ఇండియా IX-1373 విమానం

  • నేటి ఉదయం 7:15 గంటలకు విజయవాడకు చేరుకోనున్న ఎయిర్ ఇండియా విమానం.

👉విజయవాడ..

  • ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం

  • వర్షాల నేపధ్యంలో నేడు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు

  • ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం (మం) వినగడప-తోటమూల మధ్య  ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు వాగు

  • సుమారు 20 గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు..

  • చింతలపాడులో నిన్న ఈదురు గాలులకు నేలకొరిగిన  74 విద్యుత్ స్తంభాలు

  • రాత్రంతా చీకట్లోనే  చింతలపాడు గ్రామం

  • చింతలపాడులో 40 ఇళ్లు పాక్షికంగా మరో 10 ఇళ్లు పూర్తిగా ధ్వంసమైనట్లు గుర్తించిన రెవెన్యూ శాఖ

తూర్పుగోదావరి జిల్లా..

  • తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

  • పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వర్షపు నీరు

  • పొంగిపొర్లుతున్న కాలువలు

  • రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

  • రాజమండ్రితో పాటు జిల్లా అంతటా విద్యాసంస్థలకు, అంగన్వాడి కేంద్రాలకు సెలవు ప్రకటించిన అధికారులు

  • రాజమండ్రి నగరంలో ఆర్యాపురం, తుమ్మలోవ, ఇన్నిస్పేట ప్రాంతాల్లో నిలిచిపోయిన  వర్షపు నీరు

  • పోలవరం జిల్లాలో  ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న కాలువలు

  • పూర్తిగా నిండిన చెరువులు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

  • రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెంలో చింతచెట్టు పడి నేలకూలిన ఏడు విద్యుత్ స్తంభాలు

  • నిలిచిపోయిన విద్యుత్ సరఫరా... అవస్థలు పడిన గ్రామస్తులు

  • కోనసీమ జిల్లాలో అల్లకల్లోలంగా మారిన సముద్రం

  • ఓడలరేవు ,అంతర్వేది తీరాల్లో ఎగసిపడుతున్న అలలు

  • భారీగా వీస్తున్న ఈదురుగాలులు

  • మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు

  • పోలవరం,  కోనసీమ జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవు  ప్రకటించిన అధికారులు..

శ్రీకాకుళం..

  • కళింగపట్నానికి నైరుతి దిశలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం..

  • ఉత్తరాంద్రలో దంచికొడుతున్న వానలు..

  • మరో 48 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ..

  • నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు..

  • విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు..

  • కొనసాగుతున్న పోర్టు హెచ్చరికలు..

  • పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు..

  • శ్రీకాకుళంలో ఉగ్రరూపం దాల్చిన వంశధార, నాగావళి నదులు..

👉బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భారీ గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు వచ్చేశారు. తీరప్రాంతంలోని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. వంశధార, నాగావళి, బహుద నదులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

👉వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బుధవారం సాయంత్రానికి కళింగపట్నానికి 30 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 90 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అర్ధరాత్రి విశాఖపట్నం–గోపాల్‌పూర్‌ మధ్య కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement