ఏషియన్ గేమ్స్‌లో స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా? | Bollywood actor R Madhavan Son contesting In Asian Games at Japan | Sakshi
Sakshi News home page

Asian Games: ఏషియన్ గేమ్స్‌లో స్టార్ హీరో తనయుడు.. ఎవరో తెలుసా?

Sep 20 2026 5:02 PM | Updated on Sep 20 2026 5:08 PM

Bollywood actor R Madhavan Son contesting In Asian Games at Japan

జపాన్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో స్టార్‌ హీరో కుమారుడు పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని హీరోనే స్వయంగా వెల్లడించారు. బాలీవుడ్ హీరో, నటుడు ఆర్ మాధవన్ తన కుమారుడు స్విమ్మింగ్‌లో పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఆర్ మాధవన్ కుమారుడైన వేదాంత్.. స్విమ్మింగ్‌ ఫ్రీస్టైల్ విభాగంలో పోటీకి రెడీ అయ్యారు. 

కాగా.. ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ స్విమ్మింగ్‌ పోటీల్లో ఎన్నో రికార్డులు సాధించారు. పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఇప్పటికే ఎన్నో పతకాలు సాధించారు. మలేషియన్ ఓపెన్‌లో ఐదు స్వర్ణాలు, డానిష్ ఓపెన్‌లో ఒక స్వర్ణం, ఒక రజతం గెలుపొందారు. లాత్వియన్, థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో ఐదో స్థానంలో నిలిచి తన టాలెంట్‌ నిరూపించుకున్నారు. భారత్ తరపున స్విమ్మింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తోన్న యువ క్రీడాకారుల్లో వేదాంత్ ఉన్నారని ఒలింపిక్స్ అధికారిక వెబ్‌సైట్ ప్రశంసించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement