చట్టం.. వీరికి చుట్టమా..? | TDP Leader Support To Accused Person | Sakshi
Sakshi News home page

చట్టం.. వీరికి చుట్టమా..?

Oct 3 2026 8:29 AM | Updated on Oct 3 2026 8:29 AM

TDP Leader Support To Accused Person

టీడీపీ ఆధ్వర్యంలో తాజాగా జరిగిన సమావేశంలో నిందితుడు అశోక్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌తో, నాగసుందర్‌కుమార్‌

అనంతపురం క్రైం:  ఫేక్‌ డాక్యుమెంట్లతో రిజి    ్రస్టేషన్‌.. ఆస్తిపై హక్కు.. ఆపై బెదిరింపుల ఆరోపణల కేసులో ఆ ఇద్దరు నిందితులు. అయితే వీరు అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధికి బంధువులు. ఒకరు సోదరుడు, మరొకరు బావమరిది అవుతారు. అయితే వారిని అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు మినహాయింపు ఇచ్చారు. వారి జాడ లేదని న్యాయస్థానానికి విన్నవించారు. వాస్తవానికి ఆ ఇద్దరూ అధికార తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నగరపాలక సంస్థ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ బహిరంగంగానే తిరుగుతున్నారు. ఇదంతా గమనిస్తున్న ప్రజలు.. చట్టం సామాన్యులకే కానీ.. అధికార పార్టీ వారికి వర్తించదేమోనని చర్చించుకుంటున్నారు. 

అసలు కేసు ఏంటంటే..  
అనంతపురం శారదా నగర్‌లోని డోర్‌ నంబర్‌ 28–3–535 వద్ద 2025 డిసెంబరు 20న జరిగిన ఘటనకు సంబంధించి గడ్డం సాయి మనోహర్‌ ఫిర్యాదుతో అదే నెల 25న వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో క్రైం నంబర్‌ 359/2025 కింద కేసు నమోదైంది. హైకోర్టు ఉత్తర్వుల్లో నమోదైన ప్రాసిక్యూషన్‌ వివరాల ప్రకారం.. మృతి చెందిన డాక్టర్‌ ఎస్‌.కనకదుర్గ పేరుతో 2025 జూలై 1వ తేదీతో విల్లు సృష్టించారు. దాని ఆధారంగా అధికారపత్రం రూపొందించి.. తద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించి, అలా ఆస్తిపై హక్కు పొందేందుకు ప్రయత్నించారు. ఫోర్జరీ ద్వారా మోసం, అక్రమ ప్రవేశం, ఆస్తికి నష్టం, బెదిరింపులకు సంబంధించిన నేరాల కింద పలువురిపై కేసు నమోదు చేశారు.
  
దర్యాప్తులో కీలక పరిణామం 
ఈ కేసులో మరో కీలక పరిణామం దర్యాప్తు సమయంలో చోటుచేసుకుంది. తొలుత నమోదైన ఫిర్యాదులో పేర్లు లేని బోయపాటి శివరామ్‌ అలియాస్‌ అశోక్, పోలూరు నాగ సుందర్‌కుమార్‌ అలియాస్‌ సుందర్‌ను.. దర్యాప్తులో సేకరించిన సమాచారం ఆధారంగా ఏ9, ఏ10 నిందితులుగా చేర్చినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఇందులో ఏ7 నుంచి ఏ10 వరకు ఉన్న నలుగురు నిందితులు పర్యవేక్షణ లేని భూములను గుర్తించి, నకిలీ పత్రాల ద్వారా వాటిపై హక్కులు సృష్టించి, తద్వారా మోసం చేసి ఆర్థిక లాభం పొందే వారని పేర్కొన్నారు. 

నిందితుల తరఫు న్యాయవాది మాత్రం వారికి నేరంతో సంబంధం లేదని వాదించారు. వారు కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్‌ విద్యావంతులని నివేదించారు. అక్కడితో విషయం ఆగలేదు. ఏ9, ఏ10గా ఉన్న అశోక్, సుందర్‌ ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున ఇప్పుడు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడం లేదా ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్‌ వాదించింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు 2026 మార్చి 11న బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. సదరు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు ‘జాడ కనిపించలేదని’ మిన్నకుండిపోయారు.

సాక్షులను ప్రభావితం చేయరా..? 
ఫేక్‌ డాక్యుమెంట్లతో ఆస్తి దక్కించుకునే ప్రయత్నం చేసిన కేసులో ఏ–9, ఏ–10 నిందితులుగా ఉన్న అశోక్, సుందర్‌ నగరంలో బహిరంగంగా తిరుగుతున్నారు. ప్రభుత్వ, నగరపాలక సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నగరపాలక సంస్థ పనులు, టెండర్లు, ఇతర వ్యవహారాల్లోనూ కల్పించుకుంటున్నారు. ఇది అందరికీ కనిపిస్తున్న పోలీసులకు మాత్రం కన్పించడం లేదు. ఇలా అయితే సదరు నిందితులు.. కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం.. ఆధారాలను తారుమారు చేసే ప్రమాదమూ ఉంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ముఖ్యప్రజాప్రతినిధి ఈ కేసు విషయంలో నిందితులుగా ఉన్న తన సోదరుడు, బావమరిది అరెస్టు కాకుండా రక్షణ కవచంగా నిలిచారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రమైన నేరారోపణలు నమోదైనప్పుడు వారిని చట్ట ప్రక్రియకు పూర్తిగా సహకరించేలా చేయడం ప్రజాప్రతినిధి నైతిక బాధ్యత అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. నిందితుల అరెస్టులో జాప్యంపై ఎస్పీ జగదీ‹Ùను వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement