breaking news
boiler blast
-
స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో ప్రమాదం
తాడిపత్రి రూరల్: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద ఉన్న సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున పెద్ద శబ్దంతో ఎయిర్ బాయిలర్ పేలిపోయింది. ఇద్దరు కార్మికులకు గాయాలయినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ముడి ఐరన్ తయారీలో భాగంగా పలు రకాల ముడి ఖనిజాలను ఎయిర్ బాయిలర్‌లో వేసి, కొన్ని రసాయనాలను కలుపుతారు. ఐరన్ ముద్దలు తయారై బయటకు వస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఎయిర్ బాయిలర్‌లో ఎక్కువ మోతాదులో ఖనిజాలను వేయడంతో ఒత్తిడి ఎక్కువై అది పేలిపోయినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బాయిలర్‌కు కొద్దిదూరంలో నలుగురు కార్మికులు విధుల్లో ఉన్నారు. పేలుడు ధాటికి అంకు, అభినవ్ అనే కార్మికులు స్వల్పంగా గాయపడగా తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించామని ఇన్చార్జ్ తహసీల్దార్ రాజారాం తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు. కాగా, సుగ్న స్పాంజ్ అండ్ పవర్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలియడంతో మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని లోపలికి వెళ్లకుండా ఫ్యాక్టరీ సిబ్బంది అడ్డుకున్నారు. జనరల్ మేనేజర్ మహబూబ్ అలీకి ఫోన్ చేయగా.. ఆయన లిఫ్ట్ చేయలేదు. కాగా..ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు. -
నూడుల్స్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్: ఆరుగురు మృతి
Bihar Boiler Explosion: బిహార్‌లో ముజఫర్‌పూర్‌లోని నూడుల్స్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారని మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని బిహార్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు నూడుల్స్ ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవణ్ కుమార్ తెలిపారు. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) అయితే ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటరు దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారంతో. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పైగా దెబ్బతిన్న బాయిలర్ నుండి పొగ ఇప్పటికి వస్తునే ఉందని అధికారులు అన్నారు. అంతేకాదు ఈ పారిశ్రామిక ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక్కొక్కరికి ₹ 4 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) -
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు: 4 మృతి, 11 మందికి తీవ్ర గాయాలు
Vadodara Chemical Factory Boiler Blast గుజరాత్: వడోదర ఇండస్ట్రియల్ జోన్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బాయిలర్‌లో శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిముషాలకు జరిగిన పేలుడులో నాలుగేళ్ల బాలిక, 65 ఏళ్ల వృద్ధుడు సహా నలుగురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, గాయాలైన తల్లి (30)తోపాటు గాయపడిన వారినందరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు అధికారి సాజిద్ బలోచ్ వెల్లడించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల గోడలు కూలడమేకాక, 1.5 కిలోమీటర్ల మేర ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఐతే ఘటనలో మృతి చెందినవారు, గాయపడిన వ్యక్తులు ఫ్యాక్టరీ కార్మికులు, ప్రయాణికులుగా గుర్తించారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు తయారుచేసే కాంటన్ లేబొరేటరీస్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా గుజరాత్లో ఎనిమిది రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. డిసెంబర్ 16న పంచమహల్ జిల్లాలో ఇదే తరహాలో ఫ్యాక్టరీ పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. చదవండి: Rain Alert: ఈ నెల 27 నుంచి 30 వరకు చలిగాలులతో కూడిన వానలు! -
విషాదం: పేలిన బాయిలర్.. నలుగురు కార్మికులు దుర్మరణం
తమిళనాడు: కడలూర్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి నలుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం పోలీసులు కడలూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదంటే అక్రమంగా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
చెన్నై : తమిళనాడు థర్మల్ ప్లాంట్‌లో బుధవారం సంభవించిన పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పళనిస్వామి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, స్వల్పగాయాలైన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందిస్తామని తెలిపారు. ఇది వరకే సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తప్పకుండా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. (ఈ సారి లాల్బగ్చా గణేశుడి ఉత్సవాలు లేవు ) Anguished to learn about the loss of lives due to a blast at Neyveli power plant boiler in Tamil Nadu. Have spoken to @CMOTamilNadu and assured all possible help.@CISFHQrs is already on the spot to assist the relief work. Praying for the earliest recovery of those injured. — Amit Shah (@AmitShah) July 1, 2020 భారీ పేలుడు ఘటనలో ఆరుగురు చనిపోగా, 17 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. కడలూరులోని నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ( ఎన్ఎల్సీ ) థర్మల్ పవర్ స్టేషన్-2లోని ఐదవ యూనిట్ వద్ద బాయిలర్ పేలి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా 17 మందికి తీవ్రంగా గాయపడినట్లు జిల్లా ఎస్పీ శ్రీ అభినవ్ తెలిపారు. క్షతగాత్రులను చెన్నైలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఎన్ఎల్సి దగ్గరున్న అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని లేదంటే పరిస్థితి ఇంకా భయానకంగా మారేదని అధికారులు పేర్కొన్నారు. బాయిలర్ పేలుడుకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. మే నెలలోనూ ఇదే విధమైన పేలుడు సంభవించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. Tamil Nadu: Explosion at a boiler in stage -2 of the Neyveli lignite plant. 17 injured persons taken to NLC lignite hospital. Visuals from the spot. More details awaited. https://t.co/jtaOudE9P0 pic.twitter.com/FWKYNsePVO — ANI (@ANI) July 1, 2020 -
కర్ణాటకలో బాయిలర్ పేలి ఆరుగురు మృతి
బెంగళూరు: కర్ణాటకలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. బాగల్కోట్ జిల్లా కులాలి గ్రామంలోని ఓ షుగర్ ప్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ప్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పేలుడు దాటికి మూడంతస్తుల భవనం కుప్పకూలింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది శిథిలాల నుంచి ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. అధికారులు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పేలుడు జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నవారు భయబ్రాంతులకు గురయ్యారు. ప్యాక్టరీలో వాటర్ ఫిల్టర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ బీజేపీకి చెందిన మాజీ మంత్రి మురుగేశ్ నిరాని సోదరులకు చెందినదిగా గుర్తించారు. -
చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం
-
బాయిలర్ పేలుడు: యువకుడి మృతి
- ఆరుగురికి గాయాలు నెల్లూరు: కెమికల్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలం మేగనూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలడంతో అక్కడే పనిచేస్తున్న ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
బాయిలర్ పేలి ఒకరి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బాయిలర్ పేలి ముగ్గురికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బాయిలర్ పేలడంతో.. ఓ విద్యార్థితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సంపేటలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం వంట చేస్తుండగా స్ట్రీమ్ బాయిలర్ పేలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థి వరుణ్‌తో పాటు వంట బనిషి మహేందర్, అతని కుమారుడు అక్షిత్లపై వేడి నీరు పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ప్రమాదం
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మల్లాపూర్ లోని నిజాం డక్కన్ షుగర్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్)లో శనివారం ఉదయం బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. చక్కెర ఫ్యాక్టరీలో ఉన్న నీటి బాయిలర్‌లో స్వల్పంగా పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంజనీర్ భీంరామ్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే పని చేస్తున్న మరో ముగ్గురు కార్మికులు భూమయ్య, హరీష్, రాజశేఖర్‌లకు స్వల్పంగా గాయాలయ్యాయి. వీరందరిని వైద్య సేవల కోసం నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.


