బాయిలర్ పేలి ముగ్గురికి గాయాలు | 3 injured in boiler blast in warangal district | Sakshi
Sakshi News home page

బాయిలర్ పేలి ముగ్గురికి గాయాలు

Jul 9 2016 11:31 AM | Updated on Sep 4 2017 4:29 AM

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బాయిలర్ పేలడంతో.. ఓ విద్యార్థితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వరంగల్: వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బాయిలర్ పేలడంతో.. ఓ విద్యార్థితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నర్సంపేటలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం వంట చేస్తుండగా స్ట్రీమ్ బాయిలర్ పేలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న తొమ్మిదో తరగతి విద్యార్థి వరుణ్‌తో పాటు వంట బనిషి మహేందర్, అతని కుమారుడు అక్షిత్‌లపై వేడి నీరు పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement