బాయిలర్ పేలి ఒకరి మృతి | 1 killed due to boiler blast in rangareddy district | Sakshi
Sakshi News home page

బాయిలర్ పేలి ఒకరి మృతి

Oct 18 2016 11:25 AM | Updated on Mar 28 2018 11:26 AM

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు.

అబ్దుల్లాపూర్‌మెట్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సాయిప్రియ కెమికల్ పరిశ్రమలో మంగళవారం ఓ బాయిలర్ పేలి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. మృతుడు బిహార్‌కు చెందిన శివ చాంద్‌బీన్(31)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement