
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ ప్రియులను అలరించిన హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. బాలయ్య హీరోగా వచ్చిన డాకు మహారాజ్ చిత్రంతో అభిమానులను ఆకట్టుకుంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ.. ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్. ఈ సిరీస్కు రాజేశ్ ఎం. సెల్వ దర్శకత్వం వహించారు.
తాజాగా ది గేమ్ యు నెవర్ ప్లే అలోన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ ఓరిజినల్ సిరీస్గా తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్ 2న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. గేమ్ డెవలపర్ జీవితంలో ఇది క్లిష్టమైన సమయం అంటూ శ్రద్ధా శ్రీనాథ్ పోస్టర్ను పంచుకుంది. అయితే ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందనేది మాత్రం చెప్పలేదు. తనకు ఎదురైన సవాళ్లను మహిళా గేమ్ డెవలపర్ ఎలా అధిగమించిందన్న పాయింట్‌తో రూపొందిన సిరీస్‌ను రూపొందించారని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సిరీస్‌లో సంతోశ్ ప్రతాప్, చాందిని కీలక పాత్రలు పోషించారు.
Oru game developer oda life la hardest level idhuva thaan irukum. Watch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix@NetflixIndia @ApplauseSocial @nairsameer @SegalDeepak @CheruvalathP #AmalgaCreationsMedias @RajeshMSelva @ShraddhaSrinath @ActorSanthosh pic.twitter.com/hKFzPxFMIU
— Shraddha Srinath (@ShraddhaSrinath) September 4, 2025
Oru game developer oda life la hardest level idhuva thaan irukum
Watch The Game, out 2 October, only on Netflix.#TheGameOnNetflix pic.twitter.com/Op3JfnSWWv— Netflix India South (@Netflix_INSouth) September 4, 2025